- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెల్లూరులో సీన్ రివర్స్... వైసీపీ నేతలపై పోలీసులకు వాలంటీర్ల ఫిర్యాదు
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్ ప్రభుత్వంలో వార్డు వాలంటీర్లు కీలక పాత్ర వహించారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందజేశారు. అయితే కొన్ని చోట్ల జరిగిన ఘటనలతో వార్డు వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. వైసీపీ నాయకులకు అనుకూలంగా పని చేశారంటూ వార్డు వాలంటీర్లపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. దీంతో వార్డు వాలంటీర్ల తీరుపై అప్పటి ప్రతిపక్ష నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంతమంది వాలంటీర్లు అనుకూలంగా పని చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఆందోళన చేశారు. వార్డు వాలంటీర్లు సమాచారం బయటకు ఇవ్వడంతో రాష్ట్రంలో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోందని అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఆరోపించారు. వార్డు వాలంటీర్ల తీరు మార్చుకోవాలని, తాము అధికారంలోకి వస్తే వైసీపీకి అనుకూలంగా పని చేసిన వారిని తొలగిస్తామని హెచ్చరించారు.
ఇంతలో రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే కోడ్ అమల్లోకి రావడంతో వార్డు వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించింది. పింఛన్ దారుల నగదు పంపిణీకి వార్డు వాలంటీర్లను వినియోగించొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకు ప్రతిపక్ష నాయకులే కారణమంటూ వైసీపీ నేతలు ప్రచారం చేశారు. పింఛన్‌దారులకు నగదు అందకుండా ఇబ్బందులు సృష్టించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొంతమంది వార్డు వాలంటీర్లకు మాయ మాటలు చెప్పి వారితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బలవంతంగా రాజీనామా చేయించారు.
అయితే ఇప్పుడు వారంతా తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారు. వైసీపీ నాయకులపై ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో వార్డు వాలంటీర్లు ఆందోళనకు దిగారు. వైసీపీ నేతలు తమతో ఎన్నికలకు ముందు బలవంతంగా రాజీనామా చేయించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీటింగులు పెట్టి తమతో రాజీనామాలు చేయించారని, తమ ఉద్యోగాలు పోవడానికి కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు తదుపరి చర్యలకు రెడీ అవుతున్నారు.