- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడికి పది కిలోమీటర్లు నడిచి వెళ్తున్నాం: పోలీసులను వేడుకున్న విద్యార్థులు
దిశ, కళ్యాణదుర్గం: ప్రజా ప్రతినిధులకు, మంత్రి ఉషశ్రీ చరణ్‌కి తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నామని, కానీ పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల పరిధిలోని కొత్తపల్లి, జక్కిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి విన్నివించారు. ఆటో వారికైనా తెలియజేసి రోజూ బడికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మీ మాటయితే ఆటో వారు వింటారని వచ్చామని తెలిపారు.
ప్రతి రోజూ తమ పిల్లలు పది కిలోమీటర్లు నడుచుకుంటూ బడికి వెళ్తున్నారని పిల్లల తల్లిదండ్రులు వివరించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఎండలో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రతి రోజు ఆటో వారికి రానుపోను డబ్బులు ఇస్తాము సార్ మా సమస్యను పరిష్కరించండి అంటూ అమాయకంగా వివరించారు. ఆటో వారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు విద్యార్థులకు మాట ఇచ్చారు.