- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Voter ID Currection: మీ ఓటరు కార్డులో తప్పులున్నాయా..? అయితే ఇలా సరిచేసుకోండి
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ని కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ తమ ఓటరు ఐడీ కార్డులతో చేతబట్టాల్సి టైం వచ్చేసింది. ప్రభుత్వ పథకాల అమలుకు కూడా ఓటరు ఐడీని ప్రామాణికంగా చేసుకుంటున్న తరుణంలో ఆ కార్డు కీలకంగా మారింది. అయితే, చాలామంది ఏళ్ల క్రితం ప్రభుత్వం జారీ చేసిన ఓటరు ఐడీ కార్డు వీపరీతంగా తప్పులు ఉన్నాయి.
అదేవిధంగా ఇంటి పేరుకు బదులు మరో పేరు, ఫొటో సరిగా లేకపోవడం లాంటి సమస్యలతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఓటరు కార్డులోని తప్పులను ఎలా సరిచేసుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా ఓటరు గుర్తింపు కార్డుపై చిరునామాను అప్‌డేట్ చేసేందుకు గాను నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి. ఆ తరువాత డిస్‌ప్లే అయ్యే హోమ్ పేజీలో ఎలక్టోరల్ రోల్‌లో నమోదుల సవరణ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అనతరం ఫారం-8పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ముందు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కొన్ని అవసరమైన వివరాలను నమోదు చేయాలి. ఇక్కడ మీరు సెల్ఫ్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ ఎంపికను ఎంచుకోవాలి. మీ అడ్రస్ నియోజక వర్గం లోపల లేదా వెలుపల మారుతుందో లేదో కూడా మీరు ఎంచుకోవాలి.
ఆ తర్వాత సరే క్లిక్ చేయాలి. అప్పుడు మీరు మీ రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పార్లమెంటరీ నియోజకవర్గం సమాచారాన్ని పూరించాలి. ఆ తర్వాత ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్, ఇమెయిల్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అనంతరం ఏదైతే కొత్త అడ్రస్ ఎంటర్ చేసి ఓటరు ఐడీ కార్డ్‌లో అప్‌డేట్ చేయాలి. పత్రాన్ని అప్‌లోడ్ చేసిన తర్వాత తదుపరి ఎంపికపై క్లిక్ చేయాలి. ఆ తరువాత వచ్చే క్యాప్చా కోడ్‌ని నమోదు చేసి సబ్‌మిట్ బటన్‌ను ఆప్షన్ నొక్కాలి. ఆ తరువాత మీ ఆన్‌లైన్ అప్లికేషన్ వెరిఫై చేయబడుతుంది. అయితే మీరు దరఖాస్తు చేసుకునే ముందు అన్ని వివరాలు సరిగ్గా ఇచ్చామా లేదా మరో చెక్ చేసుకోవాలి. మీ ఓటర్ ఐడీలో కొత్త అడ్రస్ అప్‌డేట్ ఆటోమెటిక్‌గా అయిపోతుంది.