పెళ్లైన మహిళతో వలంటీర్ ఇల్లీగల్ అఫైర్...దారుణానికి ఒడిగట్టిన భర్త

by Seetharam |
పెళ్లైన మహిళతో వలంటీర్ ఇల్లీగల్ అఫైర్...దారుణానికి ఒడిగట్టిన భర్త
X

దిశ, డైనమిక్ బ్యూరో : భర్త మహిళా సంరక్షణ అధికారి. భార్య ఇంటి వద్దే ఉంటుంది. అయితే వలంటీర్ ఆమెతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భర్త భార్యను మందలించాడు. తమకు అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్ వేసింది. దసరా రోజు వలంటీర్ అతడి స్నేహితులు ప్రియురాలి భర్తను బెదిరించడంతో అతడు భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వలంటీర్ వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ దారుణ ఘటన వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే దొరసానిపల్లె సచివాలయంలో శివశంకర్ రెడ్డి మహిళా సంరక్షణ అధికారిగా ఉన్నాడు. శివశంకర్ రెడ్డికి భార్య ఉంది. శివశంకర్ రెడ్డి భార్య ప్రేమలీలతో వలంటీర్ పబ్బతి శ్రీను వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని భర్త శివశంకర్ రెడ్డికి తెలియడంతో భార్యను పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. అయితే ప్రేమలీల భర్తను చంపేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్‌ వేసింది. ప్రియుడితో కలిసి భార్య వేసిన మర్డర్ ప్లాన్‌ను శివశంకర్ రెడ్డి పసిగట్టాడు. అయితే దసరా రోజున శివశంకర్ రెడ్డిని వలంటీర్ పబ్బతి శ్రీను, తన స్నేహితుడు రాజాతో కలిసి బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడిన శివశంకర్ రెడ్డి ఇంటికి వచ్చి సూసైడ్ నోట్ రాశాడు. తన ఆత్మహత్యకు భార్య, ఆమె ప్రియుడు వలంటీర్ పబ్బతి శ్రీను, స్నేహితుడు రాజా అని తెలిపాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శివశంకర్ రెడ్డి భార్య ప్రేమలీల, పబ్బతి శ్రీను, రాజాలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed