- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో గెలుపు ఎవరిదో.. తేల్చేసిన ప్రముఖ సర్వే సంస్థ?
దిశ ప్రతినిధి, విజయవాడ:ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరు. ఇప్పుడు ఏపీతో సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ అంశం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం జగన్ మరోసారి అధికారం తనదేననే ధీమాతో ఉన్నారు. టీడీపీ, జనసేన ఎలాగైనా జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో ఉన్నాయి. బీజేపీ ఇప్పుడు ఈ రెండు పార్టీలతో కలిసి వస్తుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ సమయంలో ప్రముఖ సర్వే సంస్థ ఏపీ లో పబ్లిక్ పల్స్ ఎలా ఉందో స్పష్టం చేసింది. అధికారం ఎవరిదో తేల్చేసింది.
వైసీపీదే అధికారం
ప్రముఖ సర్వే సంస్థ ఆత్మసాక్షి గ్రూపు ఏపీలో ఎన్నికల ఫలితాలపై సర్వే నివేదికలను వెల్లడించింది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేసింది. మహిళలు, పురుషులు, వయసు ఆధారంగా వివిధ అంశాలపై సర్వే చేసింది. ఈ సర్వేలో అధికార వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. సర్వే సంస్థ వెల్లడించిన వివరాల మేరకు వైసీపీకి ఈ ఎన్నికల్లో 48 శాతం ప్రజా మద్దతు ఉండగా, టీడీపీ కూటమికి 46.50 శాతం ఉన్నట్లుగా తేల్చింది. ఇతరులు 3.25 శాతం ఉండగా, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2.25 శాతంగా నిర్ధారించింది. వైసీపీకి 106-110 స్థానాలు, టీడీపీ - జనసేన కూటమికి 64-68 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
ఏ జిల్లాలో ఎవరికెన్ని
అదే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తే వైసీపీకి 49 శాతం, టీడీపీ కూటమికి 45 శాతం, ఇతరులు 4 శాతం, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2 శాతంగా పేర్కొంది. మూడు పార్టీలు జత కడితే అప్పుడు వైసీపీకి 115-122 సీట్లు, కూటమికి 60-65 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇదే సమయంలో జిల్లాల వారీగా లెక్కలు స్పష్టం చేసింది. శ్రీకాకుళంలో వైసీపీకి 5, కూటమికి 3, రెండు స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉండనుంది. ఇక, విజయనగరంలో వైసీపీ -7, కూటమి -2 సీట్లు దక్కించుకుంటాయి. విశాఖ జిల్లాలో వైసీపీ -7, కూటమికి -5, హోరా హోరీ 3 స్థానాల్లో ఉండనుంది. తూర్పుగోదావరిలో వైసీపీ -10, కూటమి -7, రెండు స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంటుందని అంచనా వెల్లడించింది. పశ్చిమ గోదావరిలో వైసీపీ -7, కూటమి -4, మరో నాలుగు స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది.
పొత్తులు - కొత్త లెక్కలు
క్రిష్ణా జిల్లాలో వైసీపీ -6, కూటమి -5, ఐదు స్థానాల్లో హోరా హోరీ ఉండనుంది. గుంటూరులో వైసీపీ -7, కూటమి -7, మూడు స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉండనుంది. ప్రకాశంలో వైసీపీ -5, కూటమి -5, రెండు చోట్ల హోరా హోరీగా పేర్కొంది. నెల్లూరులో వైసీపీ -5, కూటమి -4, ఒక స్థానంలో గట్టి పోటీ కనిపిస్తుంది. కడపలో వైసీపీ -8, కూటమి -1, ఒక స్థానంలో హోరా హోరీ పోరుగా పేర్కొంది. కర్నూల్ లో వైసీపీ -10, కూటమి -3, ఒక స్థానంలో కీన్ కంటెస్ట్ ఉంటుందని అంచనా వేసింది. అనంతపురంలో వైసీపీ -7, కూటమి -3, హోరా హోరీ మరో 4 స్థానాల్లో ఉందని వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో వైసీపీ -9, కూటమి -4, కీన్ కంటెస్ట్ ఒక స్థానంలో ఉందని పేర్కొంది. ఈ నెల 5వ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో చేసిన సర్వే ఆధారంగా ఈ ఫలితాలు సర్వే సంస్థ వెల్లడించింది.
Read More..
‘నా కల’ పేరుతో ఎన్నికల ప్రచారం.. జై జగన్ నినాదంతో దద్దరిల్లుతున్న ‘సిద్ధం’ సభ