- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Vizianagaram జిల్లా రాజాంలో ఉద్రిక్తత.. బాంబులు, గాజు సీసాలతో దాడి

X
దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా రాజాం మెంతిపేట కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం స్థానిక చెరువులో పడి వెంకటేశ్ అనే యువకుడు అనుమానాస్పద మృతి చెందారు. దీంతో వెంకటేశ్ బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. అనుమానితుల ఇళ్లపై ఒక్కసారిగా దాడికి దిగారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా బాంబులు, గాజు సీసాలతో విరుకుపడ్డారు. కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో పలు ఇళ్లు, కార్లు, బైకులను ధ్వంసం అయ్యాయి. దీంతో కాలనీ వాసులు ఇళ్లు వదిలి భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనతో మెంతిపేట కాలనీలో పోలీసులు భారీగా మోహరించారు. మెంతిపేట కాలనీలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.
Next Story