- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ మూడు పార్టీల పొత్తుతో వైసీపీలో వణుకు
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ,జనసేన,బీజేపీ పార్టీల పొత్తుతో సీఎం జగన్ రెడ్డి వెన్ను లో వణుకు మొదలైంది.విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు . ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితుల్లో ఈ రాజకీయ పొత్తు అవశ్యం అని అన్నారు. ఈ పొత్తు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా, ప్రజాభీష్టంగా ఏర్పడిన పొత్తు అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి లో కేంద్ర సహకారం కీలకం అని, ఈ సారి సార్వత్రిక ఎన్నికలు సజావుగా సాగాలి అంటే కేంద్ర ప్రభుత్వం చొరవ అవసరం అని అన్నారు.
విశాఖ లో కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవి కుమార్ మరణం తో జరిగిన ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి గా బిపిన్ జైన్ ను రాత్రి కి రాత్రి వైసీపీ అభ్యర్థి గా మార్చేశారు అన్నారు.తిరుపతి ఎన్నికలో కూడా అవకతవకలు జరిపారని, ఒక ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు. శాసన మండలి ఎన్నికల్లో కూడా అవకతవకలు జరిగాయని చెప్పారు.ఈ పొత్తును చూసి ముఖ్య మంత్రి జగన్ కి నిద్ర పట్టడం లేదని , ఇంట్లో టీవీలు బద్దలు కొడుతున్నారని ఆరోపించారు.జగన్ ఆకాశంలో వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆపేస్తారు, చెట్లు కోటేస్తారని విమర్శించారు.