- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు బ్రేక్
దిశ, వెబ్ డెస్క్: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక(Vizianagaram local body MLC election)కు హైకోర్టు(High Court) బ్రేక్ వేసింది. రఘురాజు(Raghu Raja)పై శాసనమండలి చైర్మన్ మోషేనర్ రాజు(Moshener RaJu) వేసిన అనర్హత(Disqualification) వేటును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2027 నవంబర్ 31 వరకు ఎమ్మెల్సీగా రఘురాజు కొనసాగనున్నారు.
కాగా విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గతంలో వైసీపీ నాయకత్వం ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆయన పై అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ ప్రకటించింది. ఈ 11 నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికకు సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడును ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటించింది. అయితే రఘురాజుపై వేసిన అనర్హత వేటును తాజాగా హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆయన ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం విజయనగరం స్థానిక సంస్థల ఎన్నికను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.