- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వివేకా హత్య కేసు : నేడు అవినాష్ రెడ్డి విచారణపై తీవ్ర ఉత్కంఠ

X
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో నిన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి రానున్నారు. ఇప్పటికే పులివెందుల నుంచి ఆయన హైదరాబాద్ కు బయల్దేరారు. ఎంపీతో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ లీడర్లు ఆయన వెంట హైదరాబాద్ కు వస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే నాలుగుసార్లు అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. నేడు ఐదోసారి సీబీఐ ఎదుట ఆయన హాజరుకానున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సీబీఐ కీలక అంశాలను ప్రస్తావించింది. వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి పాత్ర ఉందని అభియోగాలు మోపింది.
ఇవి కూడా చదవండి:
Next Story