- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏరీ? ఎక్కడ?: వైసీపీ ఇన్చార్జి
దిశ ప్రతినిధి, విశాఖపట్నం:2019 ఎన్నికల్లో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేటి వరకు నియోజకవర్గంలో కనిపించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ ఉత్తరాంధ్ర ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి గంటా శ్రీనివాసరావు ను ఉద్దేశించి అన్నారు.అటువంటి పరిస్థితుల్లో ఓటమిని అధిగమించి ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారికి అండగా ఉన్న కేకే రాజుని ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి నాయకులు కార్యకర్తలు ప్రజలను సమన్వయ పరుస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కే కే రాజు ఏర్పాటుచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బాలయ్య శాస్త్రి లేఔట్ వద్ద గురువారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వై వి సుబ్బారెడ్డి సర్వ మతాల ప్రార్థన నడుమ పార్టీ కార్యాలయాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గొల గాని హారి వెంకట కుమారి,ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైసీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యే లు రహ్మాన్, తైనాల విజయ్ కుమార్, చింతలపూడి వెంకటరామయ్య, ఉత్తర నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, బాణాల శ్రీనివాసరావు, పేడాడ రమణి కుమారి మారిటైమ్ చైర్మన్ కాయల వెంకటరెడ్డి ,రవి రాజు, జహీర్ అహ్మద్, ఫారూఖీ, కాశీ విశ్వనాథ్, అనూష పట్నాయక్, కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ వాటి ఇన్చార్జిలు పలు కార్పొరేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ డైరెక్టర్లు పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు.