Uttarandhra: ఒకసారిగా మారిన వాతావరణం.. పలుచోట్ల వర్షాలు

by srinivas |   ( Updated:2023-03-20 16:27:22.0  )
Uttarandhra: ఒకసారిగా మారిన వాతావరణం.. పలుచోట్ల వర్షాలు
X

దిశ, ఉత్తరాంధ్ర: ఉత్తరాంధ్రలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై చాలా చోట్ల వర్షాలు కురిశాయి. అటు విజయనగరం జిల్లాలోనూ పలుచోట్ల వర్షం కురిసింది.వాతావరణ శాఖ హెచ్చరించినట్లే గత మూడు రోజుల నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. కొత్తవలస మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అకాలంగా కురుస్తున్న వర్షాలతో జీడిమామిడి తోటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed