విశాఖలో వాల్టా చట్టానికి తూట్లు

by srinivas |
విశాఖలో వాల్టా చట్టానికి తూట్లు
X

దిశ, ఉత్తరాంధ్ర: విశాఖలో చెట్లను యదేచ్ఛగా నేలకూలుస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. స్థల యజమానులు తమకు అవసరమైన రీతిలో చెట్లను కొట్టేస్తున్నారు. ఇందుకు జీవీఎంసీ నాటికి చెట్లు, ప్రభుత్వ స్థలాల్లో చెట్లు, ప్రైవేటు స్థలాల్లో చెట్లు, లీజులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో చెట్ల నరికివేతకు మినహాయింపు లేదు. ఎక్కడ చెట్లు కొట్టాలన్నా వాల్టా చట్టాన్ని అనుసరించాలి. జీవీఎంసీలో సంబంధిత శాఖ అధికారులు చూసి చూడనట్లు వదిలేయడంతో అత్యంత బలమైన ఈచట్టం నీరు గారుతోంది. వేసవి ప్రారంభంతోటే వడగాలులు, వేడిమి అత్యధికంగా నమోదవుతోంది. ఈ తరుణంలో డైమండ్ పార్క్ సాయిరాం పార్లర్ పక్కన్న పార్కింగ్ స్థలానికి ఆనుకొని ఉన్న చెట్లను కొట్టి పడేశారు. కనీస నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన చెట్లను కొట్టివేశారు. చెట్లను కొట్టించిన వారిపై సంబంధిత జీవీఎంసీ అధికారులు చర్యలు చేపట్టాల్సి వుంది.

Advertisement

Next Story

Most Viewed