Vizag Railway Station: షార్ట్ సర్క్యూట్ వల్లే విశాఖ రైల్వే ప్రమాదం: సీపీ

by Maddikunta Saikiran |
Vizag Railway Station: షార్ట్ సర్క్యూట్ వల్లే విశాఖ రైల్వే ప్రమాదం: సీపీ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న కోర్బా- విశాఖ ఎక్స్ ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రైలులోని 3బోగీలు (ఎం1,బీ6,బీ7) పూర్తిగా కాలిపోయాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీస్ అధికారులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న అగ్ని మాపక బృందం మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బోగీల్లో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

కాగా.. ఈ ఘటనపై మంత్రి అనిత,రైల్వే అధికారులతో ఫోన్లో మాట్లాడారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. కాగా అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని విశాఖ సీపీ ఫకీరప్ప తెలిపారు. ఉదయం పది గంటలకు ఈ ప్రమాదం జరిగిందని,ప్రమాదం జరగకముందే ప్రయాణికులందరూ రైలు నుంచి దిగిపోయారని తెలిపారు. బి7 బోగీలోని బాత్రూం లో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని సీపీ వెల్లడించారు.

Next Story

Most Viewed