- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: విశాఖ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విచ్చలవిడిగా ధన ప్రవాహం
దిశ, వెబ్ డెస్క్: విశాఖ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధన ప్రవాహం కొనసాగుతోంది. నేతలు తమ అభ్యర్థులను గెలిపించేందుకు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. తమ అభ్యర్థులకు ఓట్లు వేయించేందుకు ప్రలోభాలకు తెరదీస్తున్నారు. తాజాగా వెంకోజీపాలెంలోని లవకుశ అపార్ట్‌మెంట్‌లో చెప్పుల బాక్సుల్లో దాచిన రూ.26.89 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చోడవరానికి చెందిన రమేశ్ నాయుడును అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ డబ్బు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవికి చెందినవిగా పోలీసులు చెబుతున్నారు.
కాగా ఈ నెల 13న టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీతో పాటు పలు సంఘాల తరపున అభ్యర్థులు బరిలోకి దిగారు. దీంతో ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ నాయకులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఏ విధంగానైనా గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా డబ్బుతో ఓట్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారు.