- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Corporator: ఆ విషయంలో జీవీఎంసీ విఫలం
దిశ , గాజువాక: ప్రజల సమస్యల పరిష్కారంలో జీవీఎంసీ పూర్తిగా విఫల మయ్యిందని విశాఖ 86వ వార్డు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ఆరోపించారు. వార్డు పరిధిలో విద్యుత్ దీపాలు వెలగక పోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని చెప్పారు. విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో రాత్రి వేళలో పాదచారులు ప్రమాదాలకు గురి అవుతున్నారని అన్నారు. అలాగే మౌలిక సౌకర్యాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, తద్వారా వార్డు ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. జీవీఎంసీ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకుముందు గాజువాక జీవీఎంసీ జోనల్ కార్యాలయం ముందు కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు ధర్నా చేశారు. వార్డు ప్రజలతో కలిసి వినతిపత్నం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే జీవీఎంసీ కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయం ప్రాంగణంలో ఉన్న గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం జోనల్ కమిషనర్ కార్యాలయం గోడపై వినతి పత్రం అంటించారు