- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mlc Elections: పట్టభద్రులు చుక్కలు చూపించడం వెనుక అసలు కారణాలు ఇవే?
దిశ, ఉత్తరాంధ్ర: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన బాగుందని, ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ 100 శాతం ఉందని, ఆ పార్టీ శ్రేణులు ఎంత చెప్పుకున్నా ప్రతికూల అంశాలు ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర హామీల్లో జాబ్ క్యాలెండర్ అంశం చెప్పొచ్చు. నిరుద్యోగులకు పాదయాత్రలో ఇచ్చిన భరోసా పాలనలో కానరావడం లేదన్నది ప్రధానమైన ఆరోపణ. మరి రాష్ట్రమంతా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసినప్పటికీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. దీంతో ఆ పార్టీని ఆందోళన పెడుతున్నాయి.
ఉత్తరాంధ్ర పార్టీ ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, ఇంకా ఇతర మంత్రులు, కీలకమైనటువంటి నేతలు సీతం రాజు సుధాకర్‌ను ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని లెక్కకు మించి మీడియా సమావేశాలు, అంతకుమించి వ్యూహ ప్రతి వ్యూహాలు, విజయం కచ్చితంగా సాధించాల్సిందేనని అధినేత ఆదేశాలతో ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు వెనుకాడలేదని ఆరోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో వెండి బిస్కెట్లు పట్టుబడ్డాయి. పార్టీకి సంబంధించిన వ్యక్తి వద్ద లక్షలాది రూపాయలు పట్టుబడ్డాయి. ఈ అంశాలన్నీ ఓటింగ్‌కు వ్యతిరేకంగా పని చేసాయి.
మరో విషయం ఏంటంటే అభ్యర్థి సీతమ్మ రాజు సుధాకర్ ఓటర్లు నేరుగా ఫోన్ చేసినప్పటికీ కూడా ఫోన్లు లిఫ్ట్ చేయరనే వాదన ఒకటి ఉంది. ఉత్తరాంధ్ర పార్టీ ఇంచార్జిగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొనే వైవీ సుబ్బారెడ్డి అణుంగులు సైతం మీడియాను రెండు వర్గాలుగా వేరు చేసి మీడియా సమావేశాలను ఏర్పాటు చేయడం కూడా తెలుగుదేశం ఎమ్మెల్సీకి కలిసి వచ్చింది.
మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఒక ఎత్తైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, జగన్ పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ హామీ అంశం ఎమ్మెల్సీగా పోటీని తట్టుకునేందుకు సీతంరాజు సుధాకర్‌కు వ్యతిరేక అంశాలుగానే నిలిచాయి. అసలు మీడియాతో ఎలా వ్యవహరించాలో తెలియని వ్యక్తులను వైసీపీ కార్యాలయంలో ఉద్యోగులుగా పెట్టుకోవడం ఇవన్నీ కర్ణుడు చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నిక అపజయంలో కారణాలుగా కనిపిస్తున్నాయి. వైసిపి శ్రేణులు కళ్ళు తెరిచి చక్కదిద్దుకోగలిగితే మరోసారి ఇలాంటి ఫలితాలు పునరావృతం కాకుండా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.