Anakapalli: సముద్రంలో ఇద్దరు గల్లంతు.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

by srinivas |   ( Updated:2023-08-20 15:52:35.0  )
Anakapalli: సముద్రంలో ఇద్దరు గల్లంతు.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
X

దిశ, ఉత్తరాంధ్ర: అనకాపల్లి జిల్లా రాంబిల్లి సీతపాలెంలో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో గల్లంతైన ఇద్దరు యువకులను గజ ఈతగాళ్ళ సహాయంతో బయటకు తీశారు. అయితే వారిలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విశాఖకు చెందిన ఆరుగురు యువకులు విహారయాత్రకు వెళ్లారు. సముద్రంలో ఒకసారిగా అలల ఉధృతి పెరగడంతో కెరటాలు ఇద్దరి యువకుల్ని లాక్కెళ్ళాయి. మిగిలిన స్నేహితులు ఎంత ప్రయత్నించినా ఫలితంలేకుండా పోయింది. సముద్రపు నీటిలో ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. వీరిలో ఒకరు మృతి చెందడంతో స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. అనకాపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story