అల్లూరి జిల్లాలో వర్షం బీభత్సం.. ఏజెన్సీ వాసులకు బిగ్ అలర్ట్

by srinivas |
అల్లూరి జిల్లాలో వర్షం బీభత్సం.. ఏజెన్సీ వాసులకు బిగ్ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్లు ప్రాంతాలు జలమయం అయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఇళ్లు ధ్వంసం అయ్యాయి. పొలాలు నీట మునిగాయి. వరద నీటితో పాటు బురద సైతం ఇళ్లలోకి చేరింది. రోడ్లు కొట్టుకుపోవడంతో చాలా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గిరిజన ప్రాంతాల్లో వాగులు పొంగి నీరు రోడ్లపై ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తాళ్ల సాయంతో స్థానికులు వాగులు దాటుతున్నారు. మరోవైపు నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈదురుగాలలో వర్షం కురవడంతో విద్యుత్ స్తంభాలు కూలిపోయి కరెంట్‌ కష్టాలు ఏర్పడ్డాయి.

ఇదిలా ఉంటే గుంటవాడ రిజర్వాయర్ భయపెడుతోంది. భారీగా వరద చేరి ఉధృతంగా మారింది. దీంతో రిజర్వాయర్‌‌లో 1358.7 అడుగులకు నీటిమట్టం చేరింది. మరికాసేపట్లో రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed