Anakapalli: శారదా నదిలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు.. గాలింపు

by srinivas |   ( Updated:2023-05-29 15:32:18.0  )
Anakapalli: శారదా నదిలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు.. గాలింపు
X

దిశ, అనకాపల్లి: తల్లికి సహాయంగా బట్టలు ఉతకడానికి వెళ్ళిన కొడుకు, మేనల్లుడు ప్రమాదవశాత్తు నది నీటిలో గల్లంతయ్యారు. వేసవి సెలవులు కావడంతో నక్కపల్లి మండలం పోతిరెడ్డిపాలెం చెందిన పిల్లి లక్ష్మి తన కుమారుడు అనిల్ (17), మేనల్లుడు ఎడ్డాడ ప్రసాద్ (17)ను తీసుకుని వారం రోజుల క్రితం కసింకోట మండలం వెదురువాడకు చెందిన బావ ఇంటికి వెళ్లారు. అయితే తమతో తెచ్చుకున్న బట్టలు మాసిపోవడంతో ఉతికేందుకు శారదా నది వద్దకు వెళ్లారు. లక్ష్మి బట్టలు ఉతుకుతుండగా కొడుకు, మేనల్లుడు సరదాగా నదిలో ఈతకు దిగారు. అయితే ప్రమాదవశాత్తు వారిద్దరూ నీటిలో గల్లంతయ్యారు. అది గమనించిన లక్ష్మి చుట్టుపక్కల వారిని పిలిచినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే వాళ్లిద్దరు నీటిలో కొట్టుకుపోయారు. దీంతో వారి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story