జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి ప్రతిమ బహుకరణ

by Jakkula Mamatha |   ( Updated:2024-03-05 15:07:31.0  )
జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి ప్రతిమ బహుకరణ
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం:విశాఖపట్నంను రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎంకు దక్కిందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు (స్కిల్ ట్రైనింగ్ & జాబ్ ఫెయిర్) శ్రీధర్ రెడ్డి అన్నారు.పి.ఎం.పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో జరిగిన సమావేశానికి ఏపీ సీఎం జగన్ మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పలువురు నేతలు కలిశారు.దీనిలో భాగంగానే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రతిమను ఆయనకు బహుకరించారు. అనంతరం పలు విషయాలపై చర్చించి నట్లు శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ సలహాదారుడు సి.హెచ్ మధుసూదన్ రెడ్డి, చైర్మన్ కె.అజయ్ రెడ్డి, సీడాప్ చైర్మన్ ఎస్.శ్యాం ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read More..

కొడుకుని వైసీపీలోకి పంపి ఏంటి ఈ డ్రామాలు..జనసేన నాయకులు

Advertisement

Next Story