- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ అప్పులు తీర్చి అభివృద్ధి చేస్తా: KA Paul
దిశ, విశాఖపట్నం: ఏపీలో అభివృద్ధి జరగాలంటే వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే.ఏ. పాల్ కోరారు. ఆయన ఆసీలమెట్ట ఫంక్షన్ హాలులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 24న సాయంత్రం ఐదు గంటలకు తన 60 వ జన్మదిన వేడుకలు అశీల మెట్ట తన ఫంక్షన్ హాలులో జరుగుతాయని చెప్పారు. ఆ వేడుకల్లో పాల్గొన్న అందరికీ ప్రార్థన చేసిన నూనె అందజేస్తామన్నారు. మోడీ దైవ విరుద్ధ పనులు చేస్తున్నారని విమర్శించారు. మణిపూర్‌లో ఊచ కోత జరుగుతున్నా ప్రధాని మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు.
విశాఖలో ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మరోసారి కేఏపాల్ స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కూడా తన నాయకత్వం కోరుకుంటున్నారని తెలిపారు. బీసీ, దళితులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. టీడీపీ జెండా మోస్తున్న పవన్ కల్యాణ్‌కి ప్రజలు ఓట్లు వేయరన్నారు. టీడీపీ పొత్తు జనసేనకు నష్టం కలిగిస్తుందని చెప్పారు. చంద్రబాబు హయాంలో రాజధాని, ప్రత్యేక హోదా, ప్యాకేజీ తేలేక పోయారని తెలిపారు. ‘టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ తెలివిగా దూరంగా వున్నారు. ఉచిత విద్య, వైద్యం అందజేస్తాం. ప్రధాని తలచుకుంటే చంద్రబాబు నాయుడుకి బెయిల్ వస్తుంది.’ అని కేఏపాల్ పేర్కొన్నారు.