జగన్నాథ స్వామి రథయాత్రలో మంత్రి అమర్నాథ్, ఎంపీ సత్యవతి

by Javid Pasha |
జగన్నాథ స్వామి రథయాత్రలో మంత్రి అమర్నాథ్, ఎంపీ సత్యవతి
X

దిశ, ఉత్తరాంధ్ర: అనకాపల్లి గవరపాలెం అగ్గి మర్రి చెట్టు సమీపాన ఉన్న జగన్నాథ స్వామి ఆలయం నుంచి ఇంద్రద్యుమ్న హాల్ వరకు జగనాథ స్వామి రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ యాత్రలో రాష్ట్ర పరిశ్రమల మంత్రి గుడి వాడ అమర్నాథ్ తో పాటు అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతమ్మ, డాక్టర్ విష్ణుమూర్తి దంపతులు, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్ హాజరయ్యారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని, ఎంపీ దంపతు లను సాదరంగా ఆహ్వానించి వారి చే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వారిచే రథాయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీచైర్మన్ దాడి ఈశ్వరరావు, 81 వ వార్డ్ కార్పొ రేటర్ పీలా సౌజన్య రాంబాబు, 80 వ వార్డ్ కార్పొరేటర్ కొణతాల నీలిమ భాస్కర్, ఆళ్ల నాగేశ్వరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పలక యశోద రవి, కశింకోట వైఎస్ఆర్సిపి నాయకులు బుల్లి బాబు, మాజీ కౌన్సిలర్ జగన్నాథం మరియు ఆలయ కమిటీ సభ్యులు, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Next Story

Most Viewed