- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Visakha: పవన్ పుట్టిన రోజు సందర్భంగా ‘జనసేన పవర్ లీగ్’
దిశ, ఉత్తరాంధ్ర: పవన్ కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని జనసేన భీమిలి నియోజకవర్గం ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల ఆదేశాల మేరకు "జనసేన పవర్ లీగ్"ను ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుందని జనసేన సీనియర్ నాయకులు జగదభి రామ కన్స్ట్రక్షన్ చైర్మన్ నక్క శ్రీధర్ వెల్లడించారు. ఎండాడ జనసేన కార్యాలయంలో "జనసేన పవర్ లీగ్"పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బి.వి కృష్ణయ్య, ఈఎన్‌ఎస్ చందర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి.వి కృష్ణయ్య మాట్లాడుతూ పవన్ కల్యాణ్ జన్మదిన పురస్కరించుకొని సొంత నిధులతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నక్కా శ్రీధర్‌ను ఆయన అభినందించారు. క్రీడలతో మానసికోల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతుందని చెప్పారు.
ఈఎన్‌ఎస్ చందర్రావు మాట్లాడుతూ ముందుగా ఉత్తరాంధ్రలో విజయవంతంగా వారాహి యాత్ర ముగిసిందని, ఈ యాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ టోర్నమెంట్ నిర్వాహకులు నక్క శ్రీధర్ కు అభినందనలు తెలియజేశారు. శాఖరి శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉంటున్న ప్రతి జనసైనికున్ని ఒక కుటుంబంలా ఏకం చేయాలన్నదే ఈ టోర్నమెంట్ లక్ష్యమని ఈ టోర్నమెంట్ ఇటువంటి రుసుము లేదని ఇంత ఇలాంటి టోర్నమెంట్ను నిర్వహించనున్న జగదభి రామ కన్స్ట్రక్షన్ చైర్మన్ నక్కా శ్రీధర్ ను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బీవీ కృష్ణయ్య, ఈ ఎన్ ఎస్ చందర్రావు, శాఖరి శ్రీనివాస్, నక్క శ్రీధర్, సంతోష్ నాయుడు, బాలు, శ్రీకాంత్ తదితర జనసైనికులు పాల్గొన్నారు