- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ నాయకుడు కాదు... వ్యాపారి: Pawan Kalyan
దిశ, ఉత్తరాంధ్ర: జగన్ నాయకుడు కాదని.. పక్కా వ్యాపారి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. విశాఖ వారాహి యాత్రలో పాల్గొన్న ఆయన సీఎం జగన్‌పై మండిపడ్డారు. సీఎం జగన్ అన్నింటిలోనూ కమిషన్ అడుగుతారని ఆరోపించారు. ‘జగన్ డబ్బు పిచ్చోడు. ఏం చేసుకుంటారో డబ్బుతో. జగన్ అనే వ్యక్తిపై ప్రజలు కన్ను వేస్తే మరేమీ మిగలదు. మరో అవకాశం జగన్‌కి ఇస్తారా?. ఎందుకు ఇవ్వకూడదో నేను చెప్తా. మన ఆంధ్రాని ఎవరూ కాపాడుకోలేరు. రూ.60 ఉండే మందు రూ.160 చేసేశారు. మద్యపాన నిషేధం అన్నారు. మద్యంపై రూ.30వేల కోట్లు సంపాదించారు జగన్. సారా కొట్టు నుంచి అన్నింట్లోనూ జగన్‌కు వాటాలున్నాయి. జగన్‌కు అధికారం ఇచ్చింది పాలించమని, పీడించమని కాదు. ఒక్క కులం వాళ్ళకే పదవులు పంచేశారు. అదేనా రూలింగ్. నేను దానికి విరుద్ధం. జనసేన అధికారంలోకి వస్తే అన్ని కులాలకు ప్రాధాన్యం. జగన్ ఒక దొంగ. ఒక దోపిడీ దారు. నా మీద కేసులు వేసుకున్నా పరవాలేదు. కాగ్‌కు లెక్కలు చూపించకుండా దోచేశారు. పంచాయతీలను కాపాడుకోవాలి. పంచాయతీల సొమ్మును వలంటీర్ల జీతాలకు ఇచ్చేశారు. అందుకే బ్లీచింగ్ కూడా లేదు. ప్రధానితో మాట్లాడి గ్రామ వ్యవస్థను బలోపేతం చేస్తాం. గ్రామ సభలు నిర్వహిస్తాం. పంచాయతీలకు సంబంధించి కోర్టుకు వెళ్ళండి. జనసేన మీకు అండగా ఉంటుంది. జగన్ సూట్ కేసు కంపెనీలు పెట్టాడు.’ అని పవన్ వ్యాఖ్యానించారు.