- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెలకు రూ.100 చాలు.. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవచ్చు : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బిడ్ దాఖలు చేశారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ప్రజల తరపున ఆయన బిడ్‌లో పాల్గొన్నారు. ఇందుకోసం క్రౌడ్ ఫండింగ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నిధులు సేకరిస్తామని లక్ష్మీనారాయణ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 8.5 కోట్ల మంది ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నెలకు రూ.100 ఇస్తే రూ.850 కోట్లు వస్తాయని చెప్పారు. అలా నాలుగు నెలలు ఇస్తే రూ.3200 కోట్లతో స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు. నిధులు, ముడిసరుకు స్టీల్ ప్లాంట్‌కు కావాల్సినవి అని చెప్పారు. అవి ఎక్కడి నుంచి ఎలా వచ్చేయనేది అవసరమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను బిడ్డలాగా చూసుకోవాలనే ఉద్దేశంతోనే తాను బిడ్ వేసినట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం క్లీన్ షేవ్ చేయాలని భావిస్తోందని.. తాము మాత్రం క్లియర్ సేవ్ చేయాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామని లక్ష్మీనారాయణ తెలిపారు.
Also Read..