Chandrababu: రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది

by srinivas |   ( Updated:2023-05-18 05:12:43.0  )
Chandrababu: రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది
X

దిశ, ఉత్తరాంధ్ర: రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన అవసరం ప్రజలందరిపై ఉందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా పెందుర్తి రోడ్ షోలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో 24 సీట్లు వచ్చినప్పటికీ అందులో 4 విశాఖలోనే ఉన్నాయన్నారు. హుదూద్ వంటి ప్రకృతి వైపరీత్యం విశాఖను వెంటాడిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు అండగా ఉందన్నారు. హుదూద్‌కు ముందు, తర్వాత విశాఖ ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకుంటారన్నారు. వైసీపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కలిసికట్టుగా ముందుకు అడుగు వేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.

Read more:

మా ఉసురు తగులుతుంది! అమరావతి ప్రాంత అన్నదాతల శాపనార్ధాలు

సొమ్ములుంటేనే టిక్కెట్లు..!! గోదావరి జిల్లాల్లో నయా ట్రెండ్

Advertisement

Next Story