Visakha: పథకాలు మావి.. ఫొటోలు ఆయనవి.. సీఎం జగన్‌పై అమిత్ షా తీవ్ర ఆగ్రహం

by srinivas |   ( Updated:2023-06-11 14:29:47.0  )
Visakha:  పథకాలు మావి.. ఫొటోలు ఆయనవి.. సీఎం జగన్‌పై అమిత్ షా తీవ్ర ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పదేళ్ల కాలంలో రూ. 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ రాలేదన్నారు. 4 ఏళ్ల సీఎం జగన్ పాలనలో భారీగా అవినీతి జరిగిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనపై విశాఖలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో అమిత్ షా మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగిందని.. కానీ తాము చర్యలు తీసుకోలేదని తెలిపారు. తమ పాలనలో అంతరంగిక రక్షణ పూర్తిగా ఉందని.. పుల్వామాలో దాడి చేస్తే పాకిస్థాన్‌లోకి వెళ్లి భారత సేన వారికి బుద్ది చెప్పిందన్నారు. భారత సైన్యాన్ని గానీ, సరిహద్దును గానీ టచ్ చేసే శక్తి ఎవరికీ లేదని తెలిపారు. అంతటి రక్షణ రంగం భారత దేశంలో ఉందన్నారు.

‘ప్రపంచ వ్యాప్తంగా భారత దేశానికి గౌరవం ఉంది. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం లభిస్తుంది. మోదీ.. మోదీ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి రైతుల సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. జగన్ ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలి. ప్రధాని మోదీ హయాంలో దేశం చాలా అభివృద్ధి చెందింది. ఉజ్వల పథకం కింద 9 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా గ్యాస్ ఇస్తున్నాం. దేశవ్యాప్తంగా రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలు ఇస్తున్నాం. మోదీ ఇచ్చే నిధులను రైతు భరోసా పేరుతో జగన్ ఇస్తున్నట్లు మభ్యపెడుతున్నారు. కోవిడ్ సమయం నుంచి 80 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెల 5 కిలోల బియ్యం ఇస్తున్నాం. పేదలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుంటే.. దానిపై కూడా జగన్ ఫోటో వేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు రూ.5 లక్షల వరకూ ఉచితంగా బీమా ఇస్తున్నాం. రైతుల కనీస మద్దతు ధర పెంచాం. కరోనా సమయంలో ప్రతి ఒక్కరికీ రెండు వ్యాక్సిన్లు ఇచ్చాం. విశాఖ సాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ఇసుక, మైనింగ్ మాఫియా పెరిగిపోయింది.’ అని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

ప్రపంచం మొత్తం ప్రధాని మోడీ జపం: విశాఖలో హాంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed