- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరకు బీజేపీలో రచ్చ.. రచ్చ.. కొత్తపల్లి గీత కులంపై రగడ
దిశ, వెబ్ డెస్క్: మన్యం జిల్లా అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గ బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత వర్సెస్ బీజేపీ నేత నిమ్మక జయరాజుగా అరకులో అగ్గి రాజుకుంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొత్తపల్లి గీత అభ్యర్థిత్వాన్ని జయరాజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమె అసలు ఎస్టీనే కాదని ఆరోపిస్తున్నారు. అరకు బీజేపీ అభ్యర్థిని మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అలా చేయకపోతే తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తున్నారు. కొత్త పల్లి గీత కాకుండా ఎవరికి సీటు ఇచ్చినా సహకరిస్తామని చెబుతున్నారు. లేని పక్షంలో తమ దారి తాము చూసుకుంటామని జయరాజు తేల్చి చెప్పారు. అటు జయరాజు చేసిన వ్యాఖ్యలపై కొత్తపల్లి గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. జయరాజుపై చర్యలుంటాయని ఆమె హెచ్చరించారు. ఇద్దరి నేతల తీరుతో నియోజకవర్గం బీజేపీలో రచ్చ రాజుకుంది. మరి ఆ పార్టీ ఏపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.