- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:‘ఉచిత బస్సులు తిప్పి మా పొట్ట కొట్టొద్దు’:ఆటో రిక్షా కార్మిక సంఘం
దిశ ప్రతినిధి,విశాఖపట్నం:ఉచిత బస్సు పథకంపై పున:సమీక్షించాలని విశాఖ జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నేతలు సోమవారం విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు వినతి ఇచ్చారు. అనంతరం సంఘం నేతలు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో ఇప్పటికే ఓలా, రాపిడో సంస్థలు వచ్చిన తర్వాత ఆటోవాలాలకు బేరాలు తగ్గిపోయాయని, డ్రైవర్లంతా ఇల్లు గడవక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఆటోలకు బేరాలు లేక చాలా మంది ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాబట్టి ఈ విషయమై ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని కోరారు. అంతేకాకుండా ఆటో, మోటార్ డ్రైవర్లకు ఓ సొసైటీ ఏర్పాటు చేయాలని, డీజిల్, పెట్రోల్‌తో పాటు నిత్యావసరాల్ని సబ్సిడీ ద్వారా ఇప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రమాదాల నివారణ పేరిట 894 అంటూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చి, దానికి అనుసంధానంగా గత వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 21ను తీసుకు వచ్చిందని గుర్తు చేశారు. దీనివల్ల రూ. వందల్లో ఉన్న ఫైన్లు వేలకు చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ విజ్ఞప్తిని ఏపీ ప్రభుత్వం మన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.