- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Australia Vs India ODI: కరుణించవా వరుణదేవా..!
దిశ, ఉత్తరాంధ్ర: ఈ నెల 19న విశాఖలో భారత్, ఆస్ట్రేలియా మధ్య అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అటు అభిమానులు నగరానికి చేరుకుంటున్నారు. వీరి సౌకర్యార్ధం రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం రూట్ మ్యాప్‌ను కూడా ప్రకటించింది. అటు వర్షం హెచ్చరికలతో స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పడిన చిరు జల్లులతో స్టేడియంలో గ్రౌండ్ తడవకుండా తార్పలిన్ క్లాత్‌లను వేశారు. ఆదివారం వర్షం కురవకపోతే మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వర్షం నేపథ్యంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడకుండా మ్యాచ్ సజావుగా సాగాలని కోరుతున్నారు.
మరోవైపు భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం విశాఖకు చేరుకున్నారు. అయితే మ్యాచ్‌కు సంబంధించిన వీఐపీ పాసులు ఇప్పటికీ అందకపోవడంతో క్రికెట్ అంటే అమితాసక్తి ఉన్న కొందరు పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం తీవ్ర నిరాశకు గురయ్యారు. కొన్నాళ్లుగా విశాఖలో ప్రభుత్వ యంత్రాంగాలు తీవ్ర ఒత్తిడితో ఉన్నాయి. ప్రధాని మోదీ, సీఎం జగన్ విసిట్లు, గ్లోబల్ సమ్మిట్, ఎమ్మెల్సీ ఎన్నికల ఒత్తిడితో ఒక దశలో ఉద్యోగులు చేతులేత్తేశాయి. ఎట్టకేలకు ప్రోటోకాల్ ముగించుకున్నా.. ఆటవిడుపు లేకుండా పోయిందని నిట్టూర్పు విడుస్తున్నారు.