- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vivekha: సీఎం కేసీఆర్‌పై ఏపీ బీజేపీ నేతల ఫైర్
దిశ, ఉత్తరాంధ్ర: పార్లమెంటు భవన ప్రారంభోత్సవం దేశ ప్రజలకు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని ఏపీ బీజేపీ నేతలు సోము వీర్రాజు , విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంతో పాటు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ పాల్గొన్నారు. ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ భవన ప్రారభోత్సవంతో దేశప్రజలు గర్విస్తుండగా ప్రతిపక్షాలు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ , కాంగ్రెస్, కమ్యూనిస్టులపై ఆగ్రహ వ్యక్తం చేశారు. కేసీఆర్, కాంగ్రెస్, కమ్యూనిస్టులది సూడో మనస్తత్వం గలవారన్నారు. బీసీలను చిన్న చూపు చూసే పార్టీలుగా అభివర్ణించారు. నరేంద్రమోదీని వ్యతిరేకించడం లేదని, ప్రధాని పేరుతో బీసీ తెగలను అవమాన పరుస్తున్నాయరని మండిపడ్డారు. మమతా బెనర్జీ పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధాన పార్లమెంట్ భవనం ప్రారంభిస్తే వ్యతిరేకిస్తారా...? అంటూ ప్రశ్నించారు. నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తున్న పార్టీలు బీసీ వ్యతిరేకులన్నారు. కేసీఆర్ హైదరాబాద్‌లో నిర్మించిన అసెంబ్లీ ప్రారంభోత్సవం గవర్నర్‌తో చేయించారా...? అంటూ నిలదీశారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సోనియాగాంధీని కాంగ్రెస్ నాయకులు తీసుకుని వెళ్ళ లేదా.....? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ సహా అన్ని పార్టీలు సమాధానం చెప్పాలన్నారు
ఎస్టీ మహిళను రాష్ట్రపతిగా ప్రతిపాదిస్తే ఏకగ్రీవంగా ఎన్నిక కాకుండా అడ్డుపడ్డారని అన్నారు. ఆమెపై చాలా వ్యాఖ్యలు చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రతిపక్షాలు బీసీ తెగలపై అక్కసు వెళ్లగక్కే రీతిలో వారి వ్యాఖ్యలున్నాయన్నారు. కమ్యూనిస్టులు కార్పొరేట్ శక్తులని...చైనా, రష్యాలకు గొడుగులు పడుతున్నారనీ ఆరోపించారు.ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రధాని మన్ కీ బాత్‌లో ప్రస్తావించారని చెప్పారు. అది తెలుగు ప్రజలందరికీ అందరికీ గర్వకారణం అన్నారు నరేంద్రమోదీ మహోన్నత వ్యక్తిత్వం కలవారని కొనియాడారు.