Union Budget పై విశాఖలో మేధావుల సదస్సు.. అంతా బాగానే ఉందన్న జీవీఎల్

by srinivas |   ( Updated:2023-02-05 13:24:30.0  )
Union Budget పై విశాఖలో మేధావుల సదస్సు.. అంతా బాగానే ఉందన్న జీవీఎల్
X

దిశ, ఉత్తరాంధ్ర: 2029-2030 నాటికి భారత దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విశాఖలో జరిగిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడారు. 9వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. మోదీ పాలనలో ఐదో స్థానానికి ఎదిగిందని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. దేశంలో పీఎంఏ వై పథకం కింద 3.7 కోట్ల ఇళ్ళు నిర్మిస్తున్నారని జీవీఎల్ పేర్కొన్నారు.

ఆయుష్మాన్ భారత్ పథకం కింద 50 కోట్ల మంది ప్రజలు బీమా కలిగి ఉన్నారని జీవీఎల్ గుర్తుచేశారు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఉద్యోగులకు రూ. 7లక్షలు వరకు పన్ను లేదని తెలిపారు. రాష్ట్రాలకు 3.8 లక్షల కోట్లు కేటాయించారన్నారు. మూలధన పెట్టుబడి కింద 10 లక్షల కోట్లు కేటాయించారని వెల్లడించారు. రైల్వేకి 2.4 లక్షల కోట్లు కేటాయించినట్లు జీవీఎల్ స్పష్టం చేశారు. విశాఖ, అనకాపల్లి సహా దేశంలో 72 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీకి కేంద్రం 7 వేల కోట్లు నిధులు కేటాయించిందని చెప్పారు. 'ఎంఎస్‌ఎంఈ రంగానికి పెద్ద పేట వేయడం ద్వారా విశాఖ వంటి నగరాలకు మేలు జరుగుతుంది. దేశంలో వంద ఇంజనీరింగ్ కళాశాలల్లో 5 జీ ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారు. 50 నగరాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేస్తారు.' అని జీవీఎల్ పేర్కొన్నారు.

READ MORE

దిశ.. మహిళలకు ఒక భరోసా: MLC Kalyani

Advertisement

Next Story

Most Viewed