VijayasaiReddy: సీఎం జగన్ చిత్తశుద్ధి వల్లే స్టీల్ ప్లాంట్ కార్యరూపం

by srinivas |   ( Updated:2023-02-16 16:24:55.0  )
VijayasaiReddy: సీఎం జగన్ చిత్తశుద్ధి వల్లే స్టీల్ ప్లాంట్ కార్యరూపం
X

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్ డైనమిక్ నిర్ణయాలు, పాలనాపరమైన సంస్కరణల కారణంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. జగన్ సారధ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంస్కరణలు, పథకాలు నుంచి స్ఫూర్తి పొంది ఇతర రాష్ట్రాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు. విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ.. జగన్ చిత్తశుద్ధి వల్లే కడప స్టీల్ ప్లాంట్ కార్యరూపం దాల్చిందన్నారు. రాష్ట్రంలో స్పీడ్ గ్రోత్ సాధ్యపడుతోందని తెలిపారు. పోలవరం దిగువ కాపర్ డ్యాం పనులు పూర్తి, పోలవరం దిగువ కాపర్ డ్యాం పనులు విజయవంతంగా పూర్తయ్యాయని వెల్లడించారు. దిగువ కాపర్ డ్యాం పనులు పూర్తవడంతో వరదల్లోనూ ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కం రాక్ ఫిల్) డ్యామ్ పనులు చేపట్టేందుకు వీలు కలుగుతుందని అన్నారు. డయాఫ్రం వాల్‌పై ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్) నివేదిక ఆధారంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్వాకంతో దిగువ కాపర్ డ్యాం 680 మీటర్ల పొడవున కోతకు గురయ్యిందని విజయసాయిరెడ్డి తెలిపారు.

Also Read...

Visakha: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు రేనో అరెస్ట్

Advertisement

Next Story

Most Viewed