- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Ap News: టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్..

X
దిశ, ఏపీ బ్యూరో: ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం లక్ష టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందించేలా జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఈ మేరకు కార్యాచరణ రూపొందించిందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే తొలి విడతలో 48 వేలకు పైగా గృహ ప్రవేశాలు జరిగినట్లు చెప్పారు. రెండో విడతలో మరో 40 వేల గృహ ప్రవేశాలు జరగనున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. అన్ని సదుపాయాలతో పేదల ఇళ్లు ముస్తాబవుతున్నాయని పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదికగా ఆయన పలు అంశాలకు వెల్లడించారు. జగనన్న వసతి దీవెనతో 9.5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 912.71 కోట్లు జమ చేశారని స్పష్టం చేశారు.
Next Story