చంద్రబాబుపై మరో 10 కేసులు.. వెలుగులోకి సంచలన విషయం..!

by srinivas |   ( Updated:2024-03-30 14:08:59.0  )
చంద్రబాబుపై మరో 10 కేసులు.. వెలుగులోకి సంచలన విషయం..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల తేదీ ప్రకటించడంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో విమర్శల దాడి పెంచారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ప్రత్యర్థి అభ్యర్థులపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ కేసుల్లో విజయసాయిరెడ్డి ఏ2గా ఉన్నారని నెల్లూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు విమర్శించారు.

Read More..

AP Elections 2024: ఉద్యోగస్తులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్


దీంతో విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాను ఏ2 అయితే చంద్రబాబు కూడా పలు కేసుల్లో ఏ1గా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత చంద్రబాబుపై మరో 10 కేసులు నమోదు అవుతాయని జోస్యం చెప్పారు. ఏ1గా ఉన్న వ్యక్తి A2పై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని, ఆ డబ్బులతో విదేశాల్లో ఆస్తులు కొన్నారని ఆరోపించారు. సీట్ల విషయంలో ఎవరికీ అన్యాయం చేయలేదని తెలిపారు. సామాజిక వర్గాల వారీగా, సోషల్ ఇంజినీరింగ్ ద్వారా వైసీపీ అభ్యర్థులను ఖరారు చేశారని విజయసాయిరెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed