రేపే తీర్పు : అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

by Seetharam |
రేపే తీర్పు : అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలలో విధ్వంసకర ఘటనలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం, వైసీపీ నేతలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు సైతం గాయపడ్డారు. ఈ కేసులో 79 మంది టీడీపీ నేతలు ఇటీవలే బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో చంద్రబాబు నాయుడు ఏ-1గా ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై ఈనెల 22న హైకోర్టులో విచారించింది. తదుపరి విచారణను 26కు హైకోర్టు వాయిదా వేసింది. దీంతో మంగళవారం హైకోర్టులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఇరు వాదనలు విన్న హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో అంగళ్లు కేసులో చంద్రబాబు నాయుడుకు బెయిల్ వస్తుందా? రాదా? అనే ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed