- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చర్చగా మారిన వసంత మాటలు.. ఆయన వ్యూహం ఏంటీ?
దిశ, డైనమిక్ బ్యూరో: అధికార వైసీపీ షాక్ ఇచ్చి, ఇవ్వాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో టీడీపీ కండువా కప్పుకున్న అనంతరం వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేస్తానని, అలాగే చంద్రబాబు కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. పోటీపై మాట్లాడుతూ.. ఉమా మహేశ్వర్రావుతో కలసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ మైలవరం టికెట్ మాజీ ఎమ్మెల్యే ఉమాకి ఇస్తే.. వందశాతం ఆయన కోసం కూడా పని చేస్తానని చెప్పారు.
కాగా 2019 ఎన్నికల్లో మైలవరం టీడీపీ అభ్యర్ధి దేవినేని ఉమా మహేశ్వర్రావుపై వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ తరుపున నిలబడి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిలో ఉన్న ఆయన తాజాగా టీడీపీ కండువా కప్పుకున్నారు. మైలవరంలో మళ్లీ తానే ఎమ్మెల్యేగా గెలుస్తానని చెబుతూనే.. ఈ తరహ వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టికెట్ కన్ఫామ్ అయ్యి అలా మాట్లాడుతున్నారా..? లేక టీడీపీ నేత చంద్రబాబు మరేదైనా ఆఫర్ ఇవ్వడంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా..? అనేది ప్రశ్నగా మిగిలింది.