- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్‌ను YCPలోకి ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది..? వంగా గీత
దిశ, వెబ్‌డెస్క్: పిఠాపురం వైసీపీ అభ్యర్థిని వంగా గీత జనసేనలోకి రావాలని కోరుకుంటున్నానని పవన్ కల్యాణ్ కీలక చేసిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వంగా గీత రియాక్ట్ అయ్యారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను కూడా పవన్ కల్యాణ్‌ను వైసీపీలోకి రావాలని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది..? ఆయన నన్ను జనసేనలోకి రావాలనడం కూడా అలాగే ఉంటుందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌వి దింపుడు కళ్లెం రాజకీయాలని మండిపడ్డారు. ప్రజా రాజ్యం పార్టీ ద్వారానే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సైతం గీత కౌంటర్ ఇచ్చారు.
2009 కంటే ముందు నుండే తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలోకి వెళితే చిరంజీవి తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. పవన్ కాపు అయితే.. తాను కాపు ఆడబిడ్డనని అన్నారు. వలస రాజకీయ నాయకులను పిఠాపురం ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. కాగా, పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుండి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్‌పై పోటీగా వైసీపీ నుండి వంగా గీత బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో పవన్, గీత మధ్య మాటల యుద్ధం పిఠాపురంలో రాజకీయాల్లో కాక రేపుతోంది.
Read More: