Breaking: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. అక్రమాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

by srinivas |   ( Updated:2025-02-24 12:28:28.0  )
Breaking: వల్లభనేని వంశీకి బిగ్ షాక్.. అక్రమాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లనేని వంశీ(Vallabhaneni Vamsi)కి బిగ్ షాక్ తగిలింది. ఆయన చేసిన అక్రమాలపై ప్రభుత్వం(Government) సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వంశీ చేసిన అక్రమాల(Irregularities)ను వెలికితీసేందుకు నలుగురు సభ్యులతో కూడిన సిట్‌(SIT)ను ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఏలూరు డీఐజీ అశోక్ కుమార్‌(Eluru DIG Ashok Kumar)ను నియమించింది. సభ్యులుగా ప్రతాప్ శివకిషోర్, నరసింహా కిషోర్‌తో పాటు మరో ఇద్దరిని నియామకం చేసింది. ఈ మేరకు వంశీ చేసిన అక్రమ మైనింగ్‌, భూకబ్జాలపై ఈ టీమ్ విచారణ చేపట్టనుంది. దీంతో వంశీ అక్రమాలపై ఉచ్చు మరింతగా బిగుస్తోంది.

కృష్ణా జిల్లాలో అక్రమంగా గ్రావెల్, మైనింగ్ తవ్వకాలు చేపట్టారని వల్లభనేని వంశీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. వంశీ అనుచరులు, స్నేహితులపైనా అభియోగాలు నమోదు అయ్యాయి. అక్రమార్కులకు వల్లభనేని వంశీ ఆర్థిక సాయం చేశారని ఆరోపణలు సైతం వినిపించాయి. అంతేకాదు అక్రమ మైనింగ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,95 కోట్లు నష్టం వాటిల్లిందని, పర్యావరణానికి కూడా హాని కలిగిందని పలువురు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా వ్యక్తి కిడ్నాప్ కేసులో ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ సబ్ జైలులో ఉన్నారు. పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు పీటీ వారెంట్ జారీ చేశారు. మరో కేసులోనూ ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులను ఎదుర్కొంటున్న వంశీకి తాజాగా సిట్ రూపంలో మరో ఎదురు దెబ్బ తగిలింది.

Next Story