Union Budget-2024: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి భారీగా నిధుల కేటాయింపు: మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు

by Shiva |
Union Budget-2024: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి భారీగా నిధుల కేటాయింపు: మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధులు కేటాయించడం పట్ల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అనాథలా మారిందన్ని ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని నమ్మిన తమ అధినేత పవన్ కల్యాణ్ కల నేడు నేరవేరిందని తెలిపారు. కూటమిని గెలిపించిన ఆంధ్ర ప్రజలను విశ్వసించి రాష్ట్రానికి నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. కాగా, ఇవాళ అసెంబ్లీలో జనసేన డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ఎన్నికను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ ద్వారా సమాచారాన్ని అందజేశారు.

Advertisement

Next Story