AP News:ఢిల్లీ దీక్షకు దూరంగా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు..?

by Jakkula Mamatha |
AP News:ఢిల్లీ దీక్షకు దూరంగా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు..?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో శాంతి భద్రతలను పర్యవేక్షించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోడీ, రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తెలిపారు. ఈ క్రమంలో నేడు (బుధవారం) దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్ జగన్ ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులే టార్గెట్‌గా దాడులు, హత్యలు జరుగుతున్నాయని జగన్ ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 రాజకీయ హత్యలు జరిగాయని ఆరోపిస్తూ గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల నుంచి బాయ్‌కాట్ చేసిన వైఎస్ జగన్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, వీరిలో ఇద్దరు ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, వంకా రవీంద్ర మాత్రం జగన్‌తో ఢిల్లీ వెళ్లకుండా నిన్న శాసనమండలికి హాజరు కావడం చర్చనీయాంశమైంది. వీరిద్దరు ఢిల్లీకి వెళ్లకపోవడం పై రాష్ట్ర రాజకీయాల్లో పలు చర్చలకు దారి తీస్తుంది.

Advertisement

Next Story

Most Viewed