Breaking: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by srinivas |
Breaking: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో రెప్పపాటులో రెండు ప్రాణాలు పోయాయి. పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పాట్‌లోనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు యర్రగొండపాలెం మండలం చెన్నరాయుడిపల్లెవాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై మృతుల కుటుంబాలకు సమాచారం అందజేశారు. స్థానికుల నుంచి ప్రమాద వివరాలు సేకరించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Next Story