- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తుని, పాలకొండ ఎన్నిక.. మళ్లీ వాయిదా

దిశ డైనమిక్ బ్యూరో : కాకినాడ జిల్లా తుని పురపాలక సంఘం ఉపాధ్యక్షుడు ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది.తుని పురపాలక సంఘంలో వైస్ చైర్మన్ ఎన్నికకు 28 మంది కౌన్సిలర్లు హాజరు కావాలి. కోరం ఉండాలంటే 14 మంది హాజరు కావాలి. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిని 10 మంది టీడీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాగా.. మిగిలిన వారు హాజరుకాలేదు. అయితే చివరికి కోరం లేక ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అధికారులు ప్రకటించారు.ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళతామన్నారు. అదే విధంగా మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. వైసీపీ కౌన్సిలర్లు గౌర్హాజరు కావడంతో ఎన్నికను వాయిదా వేశారు. మొత్తం 19 మంది సభ్యుల్లో 14 మంది వైసీపీకి చెందిన వారు, ఐదుగురు కూటమికి చెందిన వారు ఉన్నారు. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేశారు.