- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Srivani Counter: తిరుమలలో నూతన కౌంటర్ ప్రారంభం.. ఇకపై మరింత సులభంగా దర్శనం టికెట్లు
దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల (Srivani Tickets) కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి (TTD Additional EO) తెలియజేశారు. గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్ ను ఆయన బుధవారం ఉదయం ప్రారంభించారు. కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్ ను కేటాయించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఈఓ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ (Srivani Counter) క్యూలైన్లలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడటాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు.
రోజుకు 900 టికెట్లను ఆఫ్ లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో టికెట్ కేటాయింపునకు మూడు నుండి నాలుగు నిమిషాలు పట్టేదనీ, ప్రస్తుతం ఒక నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఐదు కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ శ్రీ సత్య నారాయణ, డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, వీజీవో శ్రీ సురేంద్ర, ఏఈవో శ్రీ కృష్ణయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.