‘నిజం గెలవాలి’ బస్సు యాత్ర: శ్రీకాళహస్తిలో నారా భువనేశ్వరి పరామర్శ

by Seetharam |
‘నిజం గెలవాలి’ బస్సు యాత్ర: శ్రీకాళహస్తిలో నారా భువనేశ్వరి పరామర్శ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ బస్సు యాత్ర కొనసాగుతుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గురువారం యాత్ర కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మృతి చెందిన వెంకటరమణ కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించారు. వెంకట రమణ సతీమణికి నారా భువనేశ్వరి రూ.3లక్షల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట రమణ పిల్లలను పలకరించారు. పిల్లల చదువును తాను చూసుకుంటానని భువనేశ్వరి హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని నారా భువనేశ్వరి వెంకట రమణ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed