అర్ధరాత్రి 12 వరకు హోటల్స్‌కు అనుమతి.. త్వరలో కీలక నిర్ణయం

by srinivas |   ( Updated:2025-01-30 05:21:54.0  )
అర్ధరాత్రి 12 వరకు హోటల్స్‌కు అనుమతి.. త్వరలో కీలక నిర్ణయం
X

దిశ,వెబ్ డెస్క్: దేశంలో పర్యటక రంగం(Tourism) అంత్యంత కీలకం. ప్రకృతి వరాన్ని ఆశ్వాదించేందుకు యాత్రికులు, ప్రకృతి ప్రేమికులు విదేశాల్లో పర్యటిస్తుంటారు. అక్కడి ఉన్న వింతలు, విశేషాలను తిలికించి గుర్తులుగా ఫొటోలు తీసుకుంటారు. విదేశాల్లో టూరిజం రంగం పర్వాలేదనుకున్నా మన దేశం(Nationa)లోనే కొంత వెనబడి ఉంది. పర్యటకంలో ఎప్పటికప్పుడు కొత్తధనం అందించడంలో ఆలస్యం జరగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే టూరిజం మరీ వీక్ ఉందనే విమర్శలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో అత్యంత ఖరీదైన హోటళ్లు అంతంత మాత్రంగానే ఏర్పాటయ్యాయి. ఇక పుణ్యక్షేత్రాలు పర్వాలేదనుకున్నా అనుకుంత మేర అభివృద్ధి జరగడంలేదనే మాట వినిపిస్తుంటుంది. ఇక ఏపీ(Ap)లో అయితే టూరిజానికి చెప్పుకోదగ్గ ప్రాంతాలు ఉన్నాయి. విశాఖ(Visakha), శ్రీశైలం(Srisailam), తిరుపతి(Tirupati), విజయవాడ(Vijayawada) వంటి ప్రాంతాలకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అపారమైన అటవీప్రాంతం(Forest Area), సముద్ర తీరం(Sea Shore), చారిత్రాత్మకమైన కట్టణాలు ఉండటం ఏపీకి మరో ఆకర్షనీయం.

అయితే టూరిజంలో బెంగళూరు(Bengalur), కోల్ కతా(Kolkata), గోవా(Goa), ఢిల్లీ(Delhi), గుజరాత్(Gujarat) లాంటి ప్రాంతాలతో పోల్చుకుంటే మాత్రం ఏపీ వెనుకబడే ఉంది. దీంతో రాష్ట్రంలో టూరిజాన్ని డెవలప్‌మెంట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తోంది. ఆర్థికంగా వెనుబడిన రాష్ట్రానికి టూరిజం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu)తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy Cm Pawan Kalyan) సైతం ముమ్మరంగా అడుగులు వేస్తున్నారు. టూరిజం శాఖను అభివృద్ధి చేసే బాధ్యతను మంత్రి కందుల దుర్గేశ్‌(Minister Kandula Durgesh)కు అప్పగించారు. ఇందులో భాగంగా ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. హోటల్ రంగంపై మరింత శ్రద్ధ పెట్టారు. రాష్ట్రంలో హోటల్ రంగం(Hotels)లో పెట్టుబడులు పెట్టే వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. పలువురు ప్రముఖులను రాష్ట్రానికి ఆహ్వానించారు. హోటల్ రంగానికి రాష్ట్రంలో ఉన్న అనువైన పరిస్థితులను వివరిస్తున్నారు. ఇలా అత్యంత కీలక మైన ఒబేరా హోటళ్ల(Obera Hotels)ను ఆహ్వానించారు. దీంతో రాయలసీమ(Rayalaseema)లో పెట్టుబడులు పెట్టేందుకు ఒబేరా యాజమాన్యం సుముఖ చూపింది.


అయితే హోటళ్ల సమయంపై పలు అభ్యర్థనలు వస్తున్నాయి. హోటళ్లు త్వరగా మూసివేయడం వల్ల తమ వ్యాపారాలు ఆర్థికంగా కొంత మేర నష్టపోతున్నామని, సమయం పొడిగించాలని వినతులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి దుర్గేశ్ కీలక దిశగా అడుగులు వేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకూ హోటళ్లకు అనుమతించే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. తాజాగా హోటల్స్ ప్రతినిధులతో మంత్రి దుర్గేశ్ చర్చలు జరిపారు. వాళ్ల అభ్యర్థనలకు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా దుర్గేశ్ మాట్లాడుతూ త్వరలో లిక్కర్ పాలసీ(Liquor Polocy)లో లైసెన్స్‌ ఫీజును తగ్గిస్తామని హామీ ఇచ్చారు. టూరిజంశాఖకు ఇండస్ట్రీ హోదా ఇస్తున్నామని తెలిపారు. టూరిజం అభివృద్ధి చెందాలంటే..

హోటల్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇలా రాష్ట్రంలో పర్యటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు మంత్రి దుర్గేశ్ నిరంతరం పాటు పడుతూ తోటి మంత్రులకు కూడా తనతో పోటీ పడాలనే సవాల్ విసురుతున్నారు. మరి మిగిలిన మంత్రులు తమ శాఖల పనితీరులో ఎలాంటి మార్పులు తీసుకొస్తారో చూడాలి.

Next Story

Most Viewed