- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:భారీ వర్షాలు.. రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారం సాయంత్రానికి అల్పపీడనంగా మారింది. మంగళవారం ఉదయం మరింత బలపడి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఈ అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే మరో రెండు రోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ అల్పపీడనం కారణంగా ఈ రోజు, రేపు కోస్తా రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కురవనున్నాయి. దీంతో ఈనెల 16, 17 తేదీల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వాతావరణం బాగుంటే సెలవులను రద్దు చేస్తామని తెలిపారు. కలెక్టరేట్‌లోను, అన్నిమండల కేంద్రాలలోను ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ క్రమంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.