- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tirumala: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ప్రధాన కారణం అదే!
దిశ, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) వెళ్లే వీఐపీ (VIP)లకు టీటీడీ (TTD) కీలక సూచన చేసింది. రేపు దీపావళి (Diwali) పండుగ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను (VIP Break Darshan) పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి (Diwali) పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం (Diwali Aasthanam) కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే వీఐపీ బ్రేక్ దర్శనాలను (VIP Break Darshan) రద్దు చేస్తున్నట్లు టీటీడీ (TTD) ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం ప్రోటోకాల్ (Protocol) ప్రముఖులు మినహా మిగతా వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలిపివేయనున్నారు. దీంతో, నేడు ఎలాంటి సిఫార్సు లేఖలను టీటీడీ అధికారులు స్వీకరించడం లేదు.
నవంబర్‌లో జరిగే విశేష కార్యక్రమాలు ఇవే..
నవంబర్ నెలలో తిరుమల (Tirumala)లో జరిగే విశేష కార్యక్రమాలను టీటీడీ (TTD) ప్రకటించింది. నవంబరు 1న కేదారగౌరీ వ్రతం, నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర, నవంబరు 5న నాగుల చవితి, పెద్ద శేష వాహనం, నవంబరు 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర, నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ, నవంబరు 9న శ్రీ వారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర, 10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం నవంబరు 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి, నవంబరు 12న ప్రబోధన ఏకాదశి, నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి, నవంబరు 15న కార్తీక పౌర్ణమి,28న ధన్వంతరి జయంతి, 29న మాస శివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు.