ఆలపాటికి అన్నీ కష్టాలే..

by Mahesh |
ఆలపాటికి అన్నీ కష్టాలే..
X

దిశ ప్రతినిధి, గుంటూరు: తెలుగుదేశం, జనసేన పొత్తు ఆయా పార్టీల్లో కొందరు నాయకులకు కష్టాలు తీసుకొచ్చాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీలో సీనియర్ నాయకుడైన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇస్తారా ? లేదా ? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన సొంత నియోజకవర్గం తెనాలి టీడీపీ పొత్తుల కారణంగా జనసేనకు కేటాయించనున్నారు. తెనాలి సీటు కోసం అధిష్టానంపై ఆలపాటి ఎంతగా ఒత్తిడి తెచ్చిన జనసేన నాదెండ్ల మనోహర్ వైపే మొగ్గు చూపినట్టు తెలిసింది. దీంతో రాజా గుంటూరు పశ్చిమ, పెదకూరపాడులలో ఒక చోట తనకు టికెట్ కేటాయించాలని చంద్రబాబును కోరారు. వీటిపైన బాబు ఇప్పటి వరకు తేల్చలేదు.

అక్కడ భాష్యం ప్రవీణ్..

పెదకూరపాడు టికెట్ కోసం భాష్యం ప్రవీణ్ గట్టిగా పోటీ పడుతున్నారు. పైగా ప్రవీణ్ కు పెదకూరపాడు టికెట్ ఖరారు చేసినట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఎంపీ టికెట్ అడగాలంటే ఇప్పటికే ఆయన నియోజకవర్గానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఆలపాటి రాజకీయ భవిష్యత్తుపై గందరగోళ వాతావరణం నెలకొంది. అయినా నిబ్బరంగా రాజా తెనాలిలో టీడీపీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. రాజాకు ఎక్కడ టికెట్ ఇస్తారా అని ఆయన అనుచరులు తర్జనభర్జనలు పడుతున్నారు.

Read More..

ఎన్నికలకు ప్రత్యేక సైన్యాన్ని సిద్ధం చేసిన సీఎం జగన్​



Next Story