‘2019 ఎన్నికల్లో అందుకే ఓడిపోయాం’.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |
‘2019 ఎన్నికల్లో అందుకే ఓడిపోయాం’.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశా(AP Assembly Meetings)ల్లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2004, 2019 ఎన్నికల్లో నన్నెవరూ ఓడించలేదని.. ఆ ఎన్నికల్లో ఓటమికి నేనే కారణం అని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని పనులు చేయలేకపోవడం వల్లే ఓడిపోయామని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో పనిలో పడి పార్టీ, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేకపోయానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితే ఓటమి ఉండదని అసెంబ్లీ వేదికగా సీఎం తేల్చి చెప్పారు.

ఈ క్రమంలో ఉగాది(Ugadi) నుంచి రాష్ట్రం(Andhra Pradesh)లో పీ4 విధానం అమలు చేస్తామని తెలిపారు. నియోజకవర్గాల వారీగా పీ4 అమలుకావాలని సీఎం చంద్రబాబు తెలిపారు. పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా చేస్తాం అన్నారు. రాష్ట్రం(State), జిల్లా(District), నియోజకవర్గం(Constituency), మున్సిపాలిటీ(Municipality), మండలాల(Mandal) వారీగా విజన్ ప్రణాళిక సిద్ధమైందని పేర్కొన్నారు. సచివాలయం యూనిట్ గా తీసుకుని ప్రణాళిక అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. 2029 లో ప్రజలకు ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు వెళదాం అన్నారు.

Advertisement
Next Story

Most Viewed